మైనర్ బాలికపై లైంగిక దాడియువకుడి అరెస్ట్

journalist vaartha
By -
గీసుగొండ/ జూలై 13(జర్నలిస్ట్ వార్త);
 ప్రేమిస్తున్నానని నమ్మించి మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి, గర్భస్రావానికి కారణమైన నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌కు చెందిన బొడ్డు బన్నీ (21) అనే యువకుడు 2023లో పదో తరగతి చదువుతున్న బాలికను లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత బాలిక గర్భం దాల్చగా కేకులో అబార్షన్ మాత్రలు కలిపి ఇచ్చాడు. అయినా వేధింపులు ఆపకుండా ఇటీవల ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పోక్సో, బీఎన్‌ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మామునూరు ఏసీపీ వెంకటేష్ తెలిపారు. ఈ దర్యాప్తు అధికారి మామునూరు ఏసిపి వెంకటేష్, గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ ఎస్సై కుమార్ సిబ్బంది ఉన్నారు.