వర్ధన్నపేట/జులై 16(జర్నలిస్ట్ వార్త):
కులాంతర ప్రేమ ఓ యువకుడి ప్రాణం తీసింది. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపెల్లి రాజు (29), అదే గ్రామానికి చెందిన తమ్మడబోయిన నిఖిత (23) గతంలో ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా వేరే పెళ్లి చేశారు, రాజుపై ఇష్టం చావని నిఖిత ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసి, తిరిగి అతడితో ప్రేమను కొనసాగించింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం పెంచుకున్న నిఖిత తండ్రి రాజు, బంధువులతో కలిసి పథకం ప్రకారం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో పనిచేస్తున్న చిన్నపెల్లి రాజును దారుణంగా హత్య చేశారు.