వడ్డెర సంఘం ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా వల్లెపు సంపత్

journalist vaartha
By -
ధర్మసాగర్,/హనుమకొండ బ్యూరో జూలై 13 (జర్నలిస్టు వార్త): తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా వల్లెపు సంపత్, మండల మహిళా అధ్యక్షురాలిగా వల్లెపు అరుణ, మండల యువజన అధ్యక్షుడిగా శివరాత్రి రాజును నియమించారు. మండల కేంద్రంలోని సుస్మిత ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు వల్లెపు సమ్మయ్య అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి అయిలమల్లు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా అయిలమల్లు మాట్లాడుతూ జిల్లాలోని వడ్డెర కుటుంబాల సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. ధర్మసాగర్ మండలంలోని 13 గ్రామాల్లో నివసిస్తున్న వడ్డెరల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై పూర్తి వివరాలు సేకరించామని చెప్పారు. వడ్డెరల సమస్యల పరిష్కారానికి త్వరలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, అనంతరం స్థానిక ఎమ్మెల్యేలను కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు శివరాత్రి రాజమ్మ, రాష్ట్ర కోశాధికారి గుర్రం శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఓర్సు సమ్మయ్య, రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షుడు బోదాస్ నరసింహ, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలకుంట సంధ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు మల్లికార్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర రవీందర్, జిల్లా కోశాధికారి వల్లెపు సాంబరాజు, జిల్లా ప్రచార కార్యదర్శి ఆలకుంట మల్లయ్య, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు ముద్దంగుల రంజిత్ కుమార్, జిల్లా యువజన కార్యదర్శి గొల్లెన రమేష్, ఘనపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు శివరాత్రి రవీందర్, వేలేరు మండల అధ్యక్షుడు గొల్లెన స్వామి, మండల కార్యదర్శి డేరంగుల కుమారస్వామి, వివిధ గ్రామాల అధ్యక్షులు, కుల పెద్దలు, సంఘ నాయకులు పాల్గొన్నారు.