వర్ధన్నపేట/జులై 17(జర్నలిస్ట్ వార్త);
కుల పరువు హత్యకు గురైన చిన్నపిల్లి భాస్కర్ కుటుంబాన్ని శుక్రవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గోవింద నరేష్ మాదిగ, మంద కుమార్ మాదిగ పరామర్శించారు. వర్ధన్నపేట మండల పరిధిలోని ఉపరిపెల్లి గ్రామానికి చేరుకున్న వారు, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఎమ్మార్పీఎస్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.