కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నాయకుడు శ్రీనివాస్

journalist vaartha
By -
వర్ధన్నపేట/జూలై 19 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట నియోజకవర్గం 43వ డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు కొండపర్తి శ్రీనివాస్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోగా ఎమ్మెల్యే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మాడుగుల రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క కొమురెల్లి యాదవ్, కార్యదర్శి వడ్డేపల్లి ప్రకాష్, మాజీ ఎంపీటీసీ చింత ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ సింగరాపు అరుణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అంజాద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.