హత్యకు గురైన భాస్కర్ కుటుంబాని పరామర్శించన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,

journalist vaartha
By -
 వర్ధన్నపేట/జులై 20(జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన సినపెల్లి భాస్కర్ చిత్రాపటానికి నివాళులర్పించి, ఆయన కుటుంబాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ సోమవారం పరామర్శించారు. భాస్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, బాధితులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఆయా పోస్ట్ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పిఏసిఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, ఐనవోలు టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు బిర్రు మహేందర్ మాదిగ, పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.