వర్ధన్నపేట/ జూలై 19(జర్నలిస్ట్ వార్త);
వర్ధన్నపేట మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, మృతుడు సినపెళ్లి భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విచ్చేయనున్నారు. సోమవారం (జూలై 20) ఉదయం 8:00 గంటలకు ఆయన ఉప్పరపల్లిలోని భాస్కర్ నివాసానికి చేరుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చనున్నారు. ఈ పరామర్శ కార్యక్రమానికి వర్ధన్నపేట మండలం, ఉప్పరపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోశాల వెంకన్న గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.