వేలేరు/, జూలై 19 (జర్నలిస్ట్ వార్త): పరస్పర సహకారం, ఆర్థిక క్రమశిక్షణతో నడిచే పరపతి సంఘాలు సభ్యుల ఆర్థికాభివృద్ధికి బలమైన వేదికలుగా నిలవాలని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి అన్నారు.
వేలేరు మండల కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో ఆదివారం నిర్వహించిన శ్రీ మార్కండేయ గణపతి పరపతి సంఘం నాలుగో వార్షికోత్సవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరపతి సంఘాల ద్వారా సభ్యుల్లో పొదుపు అలవాటు పెంపొందించడంతో పాటు అవసరమైన సమయంలో తక్కువ వడ్డీతో రుణాలు అందించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సంఘ సభ్యులంతా పరస్పర విశ్వాసం, క్రమశిక్షణతో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించి, సంఘ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.