రిజర్వేషన్లపై కుట్రలను తిప్పికొట్టాలి. ఎమ్మెల్సీ కోదండరాం

journalist vaartha
By -

భీమదేవరపల్లి/జూలై19 (జర్నలిస్ట్ వార్త): హైదరాబాద్‌లో జూలై 26న నిర్వహించే రిజర్వేషన్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ ప్రజా గ్రంథాలయం వద్ద రిజర్వేషన్ డే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, 1902లో కొల్హాపూర్ పాలకుడు ఛత్రపతి సాహూ మహారాజ్ తన రాజ్యంలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయానికి మార్గం సుగమం చేశారని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ల హక్కు కల్పించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వాటి పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కదిరె కృష్ణ (హైకోర్టు అడ్వకేట్) ఆధ్వర్యంలో జరుగనుంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి, భీమదేవరపల్లి మండల జేఏసీ చైర్మన్ డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాశ్, వేముల జగదీష్, గొడుగు వజ్రమ్మ, జయ, మహమ్మద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.