వరంగల్/ జూలై 19 (జర్నలిస్ట్ వార్త):
వరంగల్ ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహంలో ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కేర్ దిలీప్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాల మేరకు వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా పోషాల వెంకన్న గౌడ్‌ను నియమించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నాయకులు దుద్దిళ్ల శ్రీనివాస్, ఎండీ నజీర్‌లను వెంకన్న గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.