మిత్రుడి కుటుంబానికి చేయూతచిన్ననాటి స్నేహానికి చిరునామాగా నిలిచిన 1999–2000 బ్యాచ్‌ మిత్రులు

journalist vaartha
By -
వర్ధన్నపేట/ సెప్టెంబరు 29 (జర్నలిస్ట్ వార్త):
చిన్ననాటి స్నేహం. ఆపదలో మానవత్వంగా మారింది. మిత్రుడు చెంగల్లె యాదగిరి మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే స్పందించిన నల్లబెల్లి ప్రభుత్వ పాఠశాల 1999–2000 పదో తరగతి స్నేహితులు, అతని కుటుంబానికి అండగా నిలిచారు. మిత్రుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతుగా రూ.35,735 సమకూర్చి అందజేసి, భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మిత్రుడి కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో ఆర్థిక సహాయంతో పాటు ధైర్యం చెప్పిన స్నేహితుల సేవాభావం, మానవత్వం పలువురి ప్రశంసలు అందుకుంది. ఏళ్లను దాటిన స్నేహం. ఆపదలోనూ తోడుగా నిలిచే బంధంగా నిలిచింది.